ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను అర శాతం వరకు పెంచుతున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తెలిపింది. మూడేండ్ల నుంచి ఐదేండ్ల ఎఫ్‌డీలపై సీనియర్‌ సిటిజన్లకు 7.20 శాతం, ఇతరులకు 6.60 శాతం వడ్డీ లభిస్తుంది. 61 రోజుల నుంచి ఆరు నెలల కాలవ్యవధి డిపాజిట్లపై వడ్డీని 4.25 శాతం నుంచి 4.75 శాతానికి పెంచింది.