మెర్సిడెజ్-బెంజ్ సంస్థ భారత మార్కెట్లోకి కొత్త ఈవీని రూ.78.50 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది. బుకింగ్‌లు మొదలయ్యాయి, ఈ నెలాఖరున డెలివరీలు ఉంటాయి. 94 కిలోవాట్ల బ్యాటరీతో సింగిల్ ఛార్జ్‌పై 711 కిమీ ప్రయాణిస్తుంది. 4.3 సెకన్లలో 100 కిమీ వేగం అందుకుంటుంది, 10 నిమిషాల రీఛార్జ్‌తో 300 కిమీ వెళ్తుంది.