ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూశాయి. అమెరికా నాస్‌డాక్ కొవిడ్ తర్వాతి అతిపెద్ద నష్టాన్ని నమోదు చేయగా, ఆసియా మార్కెట్లలోనూ తీవ్ర అమ్మకాలు వెల్లువెత్తాయి. కొరియా కోస్పీ లోయర్ సర్క్యూట్‌ను తాకింది. మాంద్యం భయాల నడుమ సురక్షిత ఆస్తుల వైపు మళ్లుతున్నా, భారత మార్కెట్లలో విదేశీ మదుపరుల కొనుగోళ్లు కొనసాగుతున్నాయి.