ఢిల్లీలో జరిగిన పంజాబీ గాయకుడు దిల్జిత్ దోసాంజ్ కచేరీలో ఓ వ్యక్తి వినూత్నంగా వ్యాపారం చేశాడు. రూ.13 చొప్పున కొన్న వాటర్ బాటిళ్లను అభిమానులకు రూ.50కి విక్రయించాడు. స్టాల్ లేకుండానే కేవలం రెండు గంటల్లో 480 బాటిళ్లను అమ్మి, ఏకంగా రూ.24,000 వ్యాపారం చేసినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు.