బియ్యం, గోధుమల కంటే మిల్లెట్స్ ఆరోగ్యానికి చాలా మంచివని అధ్యయనాలు చెబుతున్నాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న జొన్నలు మధుమేహాన్ని నియంత్రిస్తాయి. రాగుల్లో లభించే అధిక కాల్షియం ఎముకల పుష్టికి దోహదపడుతుంది. కొర్రలు శరీరానికి కావలసిన ప్రొటీన్‌ను అందిస్తాయని నిపుణులు పేర్కొన్నారు.