రాత్రి వేళ గోరువెచ్చని కుంకుమపువ్వు పాలు తాగడం వల్ల ఒత్తిడి తగ్గి గాఢ నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. అలాగే రక్తపోటు అదుపులో ఉండి గుండె ఆరోగ్యం, చర్మ కాంతి మెరుగుపడతాయి.