సాయంత్రం స్నాక్స్ కోసం ఐదు నిమిషాల్లో పాలక్ పనీర్ పకోడీలు తయారు చేసుకోవచ్చు. పనీర్ ముక్కలకు టొమాటో కెచప్, చాట్ మసాలా, కారం, ఉప్పు పట్టించాలి. వీటిని పాలకూర ఆకుల్లో చుట్టి టూత్‌పిక్ గుచ్చి, శనగపిండి మిశ్రమంలో ముంచి క్రిస్పీగా వేయించుకోవాలని ఈ రెసిపీ సూచిస్తోంది.