బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ ఎన్నికల లెక్కింపు పూర్తయింది. చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి యెరిచర్ల హనీ స్పందన 6,468 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. మొత్తం 44 వార్డుల్లో కూటమి 25, కాంగ్రెస్ 10, వైసీపీ 8 స్థానాలు సాధించాయి. ఆమంచి కృష్ణమోహన్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రదర్శనపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హర్షం వ్యక్తం చేశారు.