ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు 365 కేంద్రాల్లో లెక్కింపు జరుగుతోంది. సుమారు 39,694 మంది సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొంటుండగా, 40,679 మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.