ఆంధ్రప్రదేశ్‌లోని 211 కేంద్రాల్లో శుక్రవారం ఎంపీటీసీ, జడ్పీటీసీ రీ-పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 41.74% ఓటింగ్ నమోదైంది. కర్నూలు జిల్లాలోని కోసిగి, అర్లబండల్లో అత్యధికంగా 53.35%, మార్కాపురం జిల్లాలో 51.19%, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో 49.9% నమోదు కాగా, ఉదయం 9 గంటలకు 12.56%, 11 గంటలకు 26.95% పోలింగ్ జరిగింది.