పోకో X8s స్మార్ట్‌ఫోన్ పోలాండ్, సింగపూర్ మార్కెట్లలో విడుదలైంది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్, 3,500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.35 అంగుళాల AMOLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఇచ్చారు. ఈ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 100W ఛార్జింగ్‌తో 6,330mAh బ్యాటరీ కలిగి ఉంది.