సోనీ సంస్థ 75 ఇంచుల (189.3 సెం.మీ) భారీ డిస్‌ప్లేతో 'BRAVIA 2 II' టీవీని పరిచయం చేసింది. సన్నని బెజెల్స్, 4K Ultra HD రిజల్యూషన్‌తో వచ్చిన ఈ టీవీలో ఆడియో, గేమింగ్ ఫీచర్లు ఉన్నాయి. గూగుల్ టీవీ ఓఎస్‌తో పనిచేసే ఈ మోడల్‌లో Dolby, DTS ఆడియో సపోర్ట్ అందుబాటులో ఉంది.