తెలంగాణలో లెర్నర్ లైసెన్స్ పరీక్షను ఇంటి నుంచే రాసేందుకు రవాణా శాఖ కసరత్తు చేస్తోంది. 'సారథి' విధానం, ఏఐ ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్‌ను పరిశీలిస్తోంది. ప్రయోగాత్మక పరీక్షలు విజయవంతమైతే వారం రోజుల్లోనే అమల్లోకి తెస్తారు. మాస్ కాపీయింగ్ జరగకుండా కెమెరా కదలికలను ఏఐ పర్యవేక్షిస్తుంది.