బంగారంలో రుథేనియం, ఇరీడియం, ఓస్మియం పొడిని కలిపి బరువు పెంచుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. యాసిడ్, టచ్‌స్టోన్ పరీక్షల్లో ఇది దొరకడం లేదు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ నుంచి ఈ పొడి వస్తోందని ఇండోర్ సారాఫా మార్కెట్ వ్యాపారులు అప్రమత్తమయ్యారు. కల్తీని గుర్తించేందుకు ఎక్స్‌రే పరీక్షలు అవసరమని నిపుణులు తెలిపారు.