దీపావళికి పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే బహుమతులు, నగదుపై ఆదాయపు పన్ను చట్టం ప్రకారం మినహాయింపు ఉంటుంది. ఎంత మొత్తం ఇచ్చినా పన్ను పడదు. తాతయ్య, అమ్మమ్మ వంటి నిర్దిష్ట బంధువుల నుంచి వచ్చే నగదుకూ ఇది వర్తిస్తుంది. అయితే ఆ డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వడ్డీ సంపాదిస్తే పన్ను నిబంధనలు వర్తిస్తాయి.