సంగీత దర్శకుడు అనిరుధ్, వ్యాపారవేత్త కావ్య మారన్ గ్రీస్‌లో వివాహం చేసుకున్నారు. మతపరమైన ఆచారాలు, పురోహితులు లేకుండా సమానత్వానికి ప్రాధాన్యమిచ్చే 'సెల్ఫ్ రెస్పెక్ట్' పద్ధతిలో ఈ పెళ్లి జరిగింది. రజనీకాంత్ సమక్షంలో వీరిద్దరూ ఒకరికొకరు చైన్లు, దండలు మార్చుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.