జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిసినట్లు ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పష్టం చేశారు. అయితే పవన్‌తో సినిమా ఇప్పట్లో ఉండదని తెలిపారు. పవన్ రాజకీయాలు, వ్యక్తిగత విషయాలతో బిజీగా ఉన్నారని, సరైన కథ కుదిరినప్పుడే సినిమాపై అధికారిక ప్రకటన చేస్తానని ఆయన చెప్పారు.