రిలయన్స్ జియో రూ. 10,000 ధరతో 3 ఏళ్ల వ్యాలిడిటీ కలిగిన కొత్త అపరిమిత ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో రోజూ 2.5జీబీ డేటా, అన్‌లిమిటెడ్ 5జీ, వాయిస్ కాలింగ్, 100 ఎస్ఎమ్‌ఎస్‌లు లభిస్తాయి. జియోహాట్‌స్టార్, కాన్వా ప్రో లైట్, 50జీబీ క్లౌడ్ స్టోరేజ్ అందుతాయి. శనివారం నుండి ఇది లభిస్తుంది.