ధన్‌తేరాస్ సందర్భంగా మార్కెట్లో బంగారం, వెండికి భారీ డిమాండ్ కనిపిస్తోంది. ఇటీవల ధరలు తగ్గడంతో అమ్మకాల విలువ 15-20 శాతం పెరిగి రూ.60,000 కోట్లకు చేరవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే అమ్మకాల పరిమాణం గతేడాదితో సమానంగా ఉండవచ్చని జీజేసీ చైర్మన్ రాజేశ్ రోక్డే తెలిపారు.