దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఏడో రోజూ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,718 పాయింట్లు పెరిగి 81,028 వద్ద, నిఫ్టీ 493 పాయింట్లు ఎగిసి 25,030 వద్ద స్థిరపడ్డాయి. బీఎస్‌ఈ సంస్థల మార్కెట్ విలువ తొలిసారి రూ.500 లక్షల కోట్లు దాటగా, మదుపర్ల సంపద రూ.30 లక్షల కోట్లకు పైగా పెరిగింది.