టీటీడీలో రిటైరైన ఉద్యోగులు, కుటుంబ పింఛన్‌దారులకు నవంబర్ 7 నుండి 20 వరకు ఉచితంగా పెద్ద లడ్డూ, వడ ప్రసాదం అందించనున్నారు. తిరుపతి కేటీ రోడ్డులోని పరిపాలనా భవనం వద్ద గల కొత్త జాబాలి భవనంలో ప్రతిరోజూ ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 వరకు పీపీఓ నంబర్ల వారీగా ఇవి పంపిణీ చేయనున్నారు.