ప్రకాశం జిల్లా కొత్తపట్నం సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన బోటులో ఏడుగురు మత్స్యకారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరు తమిళనాడులోని కాశీమేడు నుంచి తొమ్మిది మందితో వేటకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. బోటుకు రంధ్రం పడి నీరు చేరడమే ప్రమాదానికి కారణమని మెరైన్ పోలీసులు అనుమానిస్తున్నారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.