ప్రస్తుతం జరుగుతున్నవి ఎన్నికలు కావని, అధికార దుర్వినియోగం, బెదిరింపులతో ఎన్నికల ప్రక్రియను హైజాక్ చేశారని వైఎస్ జగన్ మండిపడ్డారు. తమ నేతలను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు శకుని పాత్ర పోషిస్తున్నారని, షెడ్యూల్ వచ్చినప్పటి నుంచే వైఎస్సార్‌సీపీ శ్రేణులను బైండోవర్ కేసులతో ఇబ్బంది పెట్టారని ఆయన విమర్శించారు.
ఇవి ఎన్నికలా.. సెలక్షన్లా?: వైఎస్ జగన్ ఫైర్




