ఆంధ్రప్రదేశ్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పలుచోట్ల వాగ్వాదాలు, తోపులాటలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా సాగింది. 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాల్లో పోలింగ్ పూర్తయినట్లు సమాచారం. మధ్యాహ్నం 3 గంటల వరకు 58.55 శాతం పోలింగ్ నమోదైంది. క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.
ఏపీలో ముగిసిన పరిషత్ ఎన్నికల పోలింగ్




