ఆంధ్రప్రదేశ్ లోని కుప్పం, శ్రీకాకుళంలలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల నిర్మాణానికి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్థల అనుమతులు మంజూరు చేసింది. కుప్పం ఎయిర్‌పోర్టును రూ.1,142 కోట్లతో, శ్రీకాకుళం ఎయిర్‌పోర్టును రూ.750.52 కోట్ల అంచనాతో నిర్మించేందుకు ఏపీఏడీసీఎల్ ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపింది.