తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాలకు మైగ్రేషన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. 2024 జూన్ 1 నాటికి లేదా ముందే వచ్చినవారికి డీఎస్సీ, ఏపీపీఎస్సీ, పోలీస్, మెడికల్ బోర్డుల నియామకాల్లో ఈ ఊరట వర్తిస్తుంది.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలకు మైగ్రేషన్ సర్టిఫికెట్ నిబంధన సడలింపు




