ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు త్వరలో ముగియనుంది. మొత్తం 166 డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, డీఈవో ఖాళీల కోసం నవంబర్ 9 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ లేదా ఇంజినీరింగ్ చేసిన 18 నుంచి 44 ఏళ్ల లోపు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.