చలికాలంలో ఉపయోగించే గీజర్లు పాడయ్యే ముందు కొన్ని హెచ్చరిక సంకేతాలను ఇస్తాయి. నీటిని సరిగ్గా వేడి చేయకపోవడం, వింత శబ్దాలు రావడం, గీజర్ కింద నీరు లీక్ కావడం వంటివి గమనిస్తే నిర్లక్ష్యం చేయవద్దు. లోపల తుప్పు పట్టడం లేదా కనెక్షన్లు వదులై నీరు లీక్ కావచ్చు. వెంటనే టెక్నీషియన్‌తో చెక్ చేయించాలి.