తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడాకారుల భవిష్యత్తుకు భరోసానిచ్చారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. కమ్మర్‌పల్లి మినీ స్టేడియంలో 12వ రాష్ట్ర స్థాయి బాలుర సాఫ్ట్‌బాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. క్రీడాకారుల కోసం విద్య, ఉద్యోగాల్లో 2 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేసీఆర్ జీవో ఇచ్చారని చెప్పారు.