పురుషుల టీ20 క్రికెట్‌లో బీహార్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల 232 రోజుల వయసులో ప్రపంచ రికార్డు సృష్టించాడు. ముస్తాక్ అలీ టోర్నీలో సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. గతంలో క్రొయేషియాకు చెందిన జాచ్ వుకుసిక్ పేరుతో ఉన్న రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు.