ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 720 గ్రూప్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 471 ఎగ్జిక్యూటివ్, 249 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం కాగా, డిసెంబర్ 11 ఆఖరు తేదీ. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్ తెలిపింది.