ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పూర్తిస్థాయి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇందులో ప్రభుత్వ పాఠశాలల్లో 2,111, ప్రత్యేక ఉపాధ్యాయులకు 350, సొసైటీల పరిధిలో ప్రిన్సిపల్‌, పీజీటీ, టీజీటీ వంటి 260 పోస్టులున్నాయి. నవంబర్ 10 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.