అమెరికా వర్జీనియాలోని ఓ ఇంటి వద్ద రెడ్ షౌల్డర్డ్ గద్ద నేలపై కదల్లేక పడిపోయింది. స్థానికులు దానిని వైల్డ్‌లైఫ్ సెంటర్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన నిపుణులు గాయాలేవీ లేవని తేల్చారు. నిత్యం కోళ్లను ఎక్కువగా తిని 910 గ్రాములకు పైగా బరువు పెరిగిపోవడం వల్లే అది ఎగరలేకపోయిందని వారు గుర్తించారు.