యుద్ధం ముగింపునకు ఏం కావాలో చెప్పాలని సౌదీ అడగ్గా, హౌతీలు దాదాపు రూ.4.8 లక్షల కోట్ల పరిహారం, యెమెన్‌ పాలకులుగా గుర్తింపు డిమాండ్‌ చేశారు. సౌదీ దాడులు, దిగ్బంధనం నష్టాలకు దీనిని కోరారు. అయితే వారిపై సైనిక పట్టు లేకుండా సమగ్ర ఒప్పందానికి సౌదీ యువరాజు బిన్‌ సల్మాన్‌ సుముఖంగా లేరని సమాచారం.