విజయనగరం జిల్లా బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. కౌంటింగ్ ప్రారంభ రౌండ్ల నుంచే ఆధిక్యం కనబరిచిన టీడీపీ అభ్యర్థి పాసల నీరజ, తన సమీప వైసీపీ ప్రత్యర్థి బొత్స అనూషపై 5,136 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.