తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ధుమంతునిగూడెం ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసిన జనసేన అభ్యర్థి గారపాటి దివ్య (28) కౌంటింగ్‌కు కొద్దిసేపటి ముందే హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూశారు. ఫలితాల్లో ఆమె వైకాపా అభ్యర్థిపై 352 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నింపింది.