ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి ఆధిక్యం ప్రదర్శించగా, కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం తాళ్లమాపురం ఎంపీటీసీ స్థానంలో అనూహ్య తీర్పు వచ్చింది. ఇక్కడ పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి శిగినేని సుబ్బమ్మ, జనసేన అభ్యర్థి వీరం మౌనికపై 373 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం పోలైన 2,976 ఓట్లలో ఈ ఫలితం వచ్చింది.
కడప ఎంపీటీసీ ఎన్నికల్లో జనసేనకు షాక్.. ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం




