బంగారంలో రుథేనియం, ఇరిడియం, ఓస్మియం వంటి లోహాల పొడి కలిపి బరువు పెంచుతున్న కల్తీ దందా వెలుగులోకి వచ్చింది. ఈ కల్తీ యాసిడ్, గీటురాయి పరీక్షల్లోనూ దొరకడం లేదు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సరాఫా మార్కెట్‌లో నగల తయారీదారులు అనుమానం వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. కొనుగోళ్లలో అప్రమత్తంగా ఉండాలని వ్యాపారులకు సూచించారు.