సంవత్సరం పొడవునా నిల్వ ఉండేలా గోంగూర పచ్చడి చేసుకోవడానికి తడి లేకుండా ఆకులను ఆరబెట్టాలి. కొండ గోంగూర లేదా పచ్చళ్ల గోంగూరను వాడవచ్చు. కొండ గోంగూరలో పులుపు ఎక్కువ కాబట్టి చింతపండు తగ్గించాలి. పల్లీ నూనెలో ఎండుమిర్చిని దోరగా వేయించుకుని ఈ పచ్చడిని తయారుచేసుకోవాలి.