పెంపుడు కుక్కలకు పచ్చి చికెన్ తినిపించడం వల్ల నరాల బలహీనత, పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని పరిశోధనలో తేలింది. పచ్చి చికెన్‌లోని క్యాంపిలోబాక్టర్ బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థను పాడుచేసి విరేచనాలు, వాంతులు కలిగిస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థ ద్వారా నరాలపై ప్రభావం చూపి, ఏపీఎన్ అనే పక్షవాతం తరహా వ్యాధికి దారితీస్తుందని అధ్యయనం తెలిపింది.
కుక్కలకు పచ్చి చికెన్ పెడుతున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు!




