తెలంగాణలోని ప్రైవేట్ ఐవీఎఫ్ కేంద్రాల అక్రమాలపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. అండాల సేకరణ ముఠాతో సంబంధమున్న కేంద్రాలను మూసివేయడంతో పాటు, వైద్యుల లైసెన్సులను రద్దు చేయాలని భావిస్తోంది. సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని మంత్రి దామోదర రాజనర్సింహా అధికారులను ఆదేశించారు.
అక్రమాలకు పాల్పడే IVF కేంద్రాలపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు




