హైదరాబాద్‌ను అంతర్జాతీయ ఫిన్‌టెక్, గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కేంద్రంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైటెక్ సిటీలో సింగపూర్ సంస్థ ఆర్థా ఫిన్‌టెక్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ప్రపంచ స్థాయి డిజిటల్ సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరుల కల్పనపై దృష్టి పెట్టామని చెప్పారు.