ధన్తేరాస్ సందర్భంగా బంగారం, వెండి అమ్మకాల విలువ 20-30 శాతం పెరగొచ్చని నగల వ్యాపారులు అంచనా వేస్తున్నారు. జనవరి రికార్డు ధరలతో పోలిస్తే రేట్లు తగ్గడంతో విక్రయాలు బాగుంటాయని ఆశిస్తున్నారు. అయితే వాల్యూమ్ పరంగా విక్రయాలు గతేడాది స్థాయిలోనే ఉండొచ్చని, తక్కువ బరువున్న నగలకే కొనుగోలుదారులు మొగ్గుచూపుతున్నారని తెలిపారు.
ధన్తేరాస్ వేళ బంగారం, వెండి అమ్మకాలపై వ్యాపారుల ఆశలు




