దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 2,009 పాయింట్లు పెరిగి 79,310.01 వద్ద ముగియగా, నిఫ్టీ 576 పాయింట్లు ఎగబాకి 24,536.60 వద్ద స్థిరపడింది. ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజే రూ.8.28 లక్షల కోట్లు పెరిగింది. అంతర్జాతీయ సానుకూలతలు, కొనుగోళ్లు సూచీల పెరుగుదలకు దోహదపడ్డాయి.
స్టాక్ మార్కెట్లలో భారీ లాభాలు: సెన్సెక్స్ 2,009 పాయింట్లు అప్




