ఇంగ్లాండ్ టీ20 బ్లాస్ట్ టోర్నీలో నార్తాంప్టన్‌షైర్ తరఫున ఆడిన ఆస్ట్రేలియా బ్యాటర్, మాజీ కేకేఆర్ స్టార్ క్రిస్ లిన్ కొకైన్ వాడినట్లు తేలింది. జులై 18న జరిపిన సాధారణ డ్రగ్ పరీక్షలో పాజిటివ్‌గా తేలడంతో అతనిపై నెల రోజుల నిషేధం విధించారు. ఆయన ఈ నిషేధ కాలాన్ని ఇప్పటికే పూర్తి చేసుకున్నారు.