హయత్‌నగర్‌లోని మేపుల్ ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో లీగల్ అవేర్‌నెస్ కార్యక్రమం జరిగింది. ఇందులో ఇన్‌స్పెక్టర్ శంకరయ్య, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రమేష్ పాల్గొని విద్యార్థులకు చట్టాలు, పౌర హక్కులు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. సైబర్ మోసం జరిగితే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.