వేక్‌ఫిట్ నిర్వహించిన స్లీప్ ఇంటర్న్‌షిప్ సీజన్-5లో ముంబైకి చెందిన జినియా ఛటర్జీ విజేతగా నిలిచారు. రెండు నెలల పాటు సాగిన ఈ పోటీలో ఆమె రూ.9.6 లక్షల ప్రైజ్ మనీతో పాటు ఉచిత ఫారిన్ ట్రిప్‌ను గెలుచుకున్నారు. 2 లక్షలకు పైగా దరఖాస్తుల నుంచి 10 మందిని ఎంపిక చేశారు.