యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్-2026 మెయిన్స్ ఫలితాలను నవంబర్ 5న విడుదల చేసింది. ఈ పరీక్షల్లో 2,526 మంది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. ఆగస్టు 21 నుంచి 30 వరకు జరిగిన మెయిన్స్‌కు తెలంగాణ నుంచి 751 మందితో పాటు మొత్తం 13,343 మంది అర్హత సాధించారు. డిసెంబర్‌లో ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యే అవకాశముంది.
యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ ఫలితాలు విడుదల.. 2,526 మంది ఇంటర్వ్యూకు ఎంపిక




