ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ నుంచి రోజుకు కనీసం 20 వేల టన్నులకు పైగా బొగ్గు రవాణా చేయాలని సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి ఆదేశించారు. రాష్ట్ర విద్యుత్తు అవసరాల కోసం బొగ్గు అధికోత్పత్తికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సమీక్షలో సూచించారు.