హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం కొత్త చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా గిరీశ్‌ దొంగ్రే నియమితులయ్యారు. ఈ నియామకం గురువారం నుంచే అమల్లోకి వచ్చినట్లు హెచ్‌సీఏ ప్రకటించింది. క్రికెట్‌ పరిపాలన, మేనేజ్‌మెంట్‌లో ఆయన అనుభవం హెచ్‌సీఏ కార్యకలాపాలకు ఎంతో ఉపయోగపడుతుందని కార్యదర్శి జీవన్‌రెడ్డి తెలిపారు. లక్ష్యాల సాధనకు కౌన్సిల్, సీఈఓ, అడ్మినిస్ట్రేటివ్‌ టీమ్‌ కలిసి పనిచేస్తారని చెప్పారు.